Friday, April 19, 2024
- Advertisement -

కరోనా వైరస్.. ఇలా సోకే ప్రమాదం ఉంది..!

- Advertisement -

కరోనా వైరస్.. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెట్టిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో మనుషులకు జంతువులు పాముల మాంసం తినడం వల్ల సోకిన ఈ వైరస్ ప్రపంచదేశాలకు విస్తిరిస్తోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధి వల్ల 82మంది చనిపోయారు. 2700కు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కూడా ఈ కరోనా వైరస్ వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే చైనాకు వెళ్లిన కొంతమందికి వైరస్ సోకినట్టు సమాచారం. ఈ వ్యాధి గాలి ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ సోకిన వారికి లక్షణాలు తొందరగా కనిపించవు. దాంతో ఈ వైరస్ సోకిన వారు ఎంతమందో కనిపెట్టడం కష్టం. చైనాలో ఎంబీబీఎస్ చేసినరాజస్థాన్ వ్యక్తి ఇండియా కు రాగా అతడికి వ్యాధి లక్షణాలు ఉన్నట్టు తెలిసింది. అతడిని జనసంచారానికి దూరంగా ప్రత్యేక ఆస్పత్రి లో ఉంచి రాజస్థాన్ సర్కారు చికిత్స చేయిస్తోంది. గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతుకులాడే పదాల్లో ‘కరోనా’ వైరస్ ఉందట.

ఇది ఎలా వ్యాపిస్తుంది.? లక్షణాలు ఎలా ఉంటాయి.? ఎలా వ్యాధి తగ్గించుకోవచ్చనే విషయాలపై భారతీయులు శోధిస్తున్నట్టు తెలిసింది. కరోనా వైరస్ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో గూగుల్ లో ట్రెండింగ్లో ఉంది. అయితే కరోనా పేరుతో పాపులర్ అయిన బీర్ ఒకటి ఉంది. దానిపేరు ‘కరోనా బీర్’. దీంతో అందరూ ఈ బీర్ పై ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ కు కరోనా బీర్ కు సంబంధం లేకున్నా గూగుల్ లో కరోనా బీర్ వస్తుండడంతో అది ట్రెండింగ్ అవుతోంది.

లక్షణాలు :
ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది.
తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది.
ఇలాంటి లక్షణాలు ఉంటే… వెంటనే డాక్టర్ను కలవాలి.

ఎలా వ్యాపించవచ్చు :
ప్రస్తుతం ఇది మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది.
వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా పక్క వారికి వచ్చే ప్రమాదం ఉంది.
వైరస్ సోకిన రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది.
రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా అక్కడ ఉండే వైరస్ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -