పోలీస్ కారులోనే శృంగారం చేసిన ప్రేమ జంట.. అరెస్ట్..!

6017
Couple arrested for Romance in a car
Couple arrested for Romance in a car

కామంతో కళ్ళు మూసుకుని పోయేవారికి ఏ టైం.. ఎక్కడ.. అనే బేధాలు ఉండావు. ఇప్పుడు ఓ జంట కూడా అలాంటి పనే చేసింది. సోయిలేకుండా తాగి మద్యం మత్తులోనే శృంగారం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఫుల్లుగా తాగి మైమరిచి ఉన్నారు. ఓ ప్రేమ జంట న్యూసెన్స్ సృష్టించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

పోలీస్ కారులో వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళుతున్నారు. అయితే మధ్యలో టీ కోసమని పోలీసులు కారు ఆపి దిగి వెళ్లారు. ఆ ప్రేమ జంట మాత్రం కారులోనే ఉంది. దాంతో ఇదే టైం అనుకుని బట్టలన్నీ విప్పేసి కారులో శృంగారం చేయడం స్టార్ట్ చేశారు. పోలీసులు పని పూర్తి చేసుకొని వచ్చేసరికి వారిద్దరి జంట నగ్నంగా సెక్స్ చేసుకుంటూ మునిగితేలుతున్నారు.

అవాక్కైన పోలీసులు వారిని వారించారు. పోలీస్ కారులో ఇదేం పని అని కోపడ్డారు. కానీ మద్యం మత్తులో ఉన్న వారు పోలీసుల మాట వినలేదు. దాంతో బలవంతంగా వారిద్దరిని విడదీసి కారులోంచి బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటన న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ లో చోటుచేసుకుంది. మద్యం సేవించి న్యూసెన్స్ చేసినందుకు పోలీస్ కారులోనే శృంగారానికి పాల్పడినందుకు కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించారు.

Loading...