తాజా సర్వే.. మేలో కరోనా ఇలా ఉండబోతుందట..!

1243
Covid 19 likely to peak in India by early or mid May
Covid 19 likely to peak in India by early or mid May

ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎక్కడ కూడా తగ్గు ముఖం పెట్టడం లేదు. మన దేశంలో కుడా కరోనా కేసులు పేరుగుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే రోజుల్లో మన దేశంలో ఈ కరోనా వైరస్ ఏ మలుపు తీసుకోనుంది ? రెండో దశ లాక్ డౌన్ అయిపోయే సరికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎంతగా పెరగనుంది ? అనేది అంచనా వేసేందుకు ఓ ప్రముఖ ఆంగ్ల వార్త ఛానల్ సర్వే జరిపింది.

అందుకోసం ఎక్స్ పోజ్డ్ ఇన్ఫెక్టెడ్ రెజిస్టంట్ (ఎస్ ఈఐ ఆర్) సహా పాలీ నోమియల్ రిగ్రెషన్ రకానికి చెందిన రెండు గణాంక విశ్లేషణా పద్ధతులను వినియోగించారు. ఈ అధ్యయనం కోసం కరోనా మహమ్మారి వ్యాప్తి పై కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న రోజువారీ బులెటిన్ లలోని సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. వాటి ఆధారంగా అధ్యయనం జరపగా.. మే 3 వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 54230కి చేరొచ్చని ఎస్ ఈఐ ఆర్ నమూనాలో వెల్లడైంది. ఈ సంఖ్యను మిగతా రెండు పద్ధతుల్లో వచ్చిన కేసుల సంఖ్యలతో కలిపి సగటు తీస్తే 38534 వచ్చింది.

ఎంపిక చేసిన కొన్ని రంగాలకు ఏప్రిల్ 20 నుంచి సడలింపులు ఇచ్చినందున ఆ ప్రభావం తో కేసుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక మే 14 వచ్చే సరికి కరోనా కేసులు ఏకంగా 2.09 లక్షలకు చేరొచ్చని ఎస్ ఈఐ ఆర్ నమూనా తెలిపింది. మిగతా రెండు నమూనాల్లో మాత్రం కేసులు వరుసగా 26442.. 34095కు పెరగొచ్చని తేలింది. ఈ మూడు అధ్యయన నమూనాల్లో వచ్చిన ఫలితాల సగటు మాత్రం 65601 వచ్చింది. లాక్ డౌన్ అమలు తీరు ప్రజల వ్యవహారశైలి ఇన్ఫెక్షన్ల వ్యాప్తిరేటు ఆధారంగా కేసుల సంఖ్య పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది నిర్ణయమవుతుందని అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా ముందుకు వెళ్తే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

Loading...