Wednesday, April 24, 2024
- Advertisement -

చంద్ర బాబుుకు మూడు రోజులే డెడ్ లైన్….కూల్చడం గ్యారెంటీ

- Advertisement -

కరకట్టమీద ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేవేయడం షురూ చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలోనె అన్ని అక్రమ కట్టడాలకు నోటీసులిచ్చిన సీఆర్ డీఏ ఇప్పుడు కూల్చివేతలు మొదలు పెట్టింది. నాలుగు రోజుల కిందట రెండోసారి నోటీసులు జారీచేసిన అధికారులు.. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, లేకపోతే తామే కూల్చేస్తామని పేర్కొన్నారు. నోటీసులు జారీచేసిన కట్టడాల్లో చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని రమేశ్ గెస్ట్‌హౌస్ కూడా ఉంది.

లింగమనేనితో పాటు నోటిసులందుకున్న ఇతర నిర్మాణాలపై చర్యలకు సిఆర్డీఏ రంగంలోకి దిగింది. 5 ఎకరాల స్ధలంలో కరకట్టకు దిగువ భాగంలో పాతూరి కోటేశ్వరరావు గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. ఆందులో నదిని ఆక్రమించి నిర్మించిన భాగాన్ని అధికారులు కొట్టేస్తున్నారు. దాంతో చంద్రబాబు ఇంటిని కొట్టేస్తున్నట్లు ఎల్లోమీడియా ఒకటే నానా యాగి చేస్తోంది.

చంద్రబాబు నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ ను కూలగొట్టటానికి ఇంకా మూడు రోజులే డెడ్ లైన్ మిగులుంది. ఎందుకంటే లింగమనేనికి నోటీసులిచ్చి ఈరోజుకు నాలుగు రోజులైంది. ఇప్పటి వరకు లింగమనేని స్పందించలేదు.ఎలాగూ అక్రమ నిర్మాణాలని నిర్ధారించారు కాబట్టి ఆ భాగాన్ని కూల్చేయటం ఖాయమే అని తేలిపోయింది.

కృష్ణా కరకట్టపై నిబంధనలు ఉల్లంఘించిన 31 కట్టడాలకు సీఆర్‌డీఏ అధికారులు గతంలో ప్రాథమిక నోటీసులిచ్చారు. తర్వాత వారిని పిలిపించి వాదనలు విన్నారు. వీటిలో 5 కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించి తుది నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లో ఆ కట్టడాలను వారే కూల్చివేయాలని.. లేకపోతే సీఆర్‌డీఏ చర్యలు తీసుకుంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిలో శివస్వామి ఆశ్రమంలో ఉన్న 2 కట్టడాలు, ఆక్వాడెవిల్స్‌ పేరుతో ఉన్న ఒక కట్టడం, మరో 3 అంతస్తుల భవనం ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -