Wednesday, April 24, 2024
- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌, భార‌త్ మ్యాచ్‌పై షాక్ ఇచ్చిన బీసీసీఐ..

- Advertisement -

పుల్వామా ఉగ్రదాడి నేప‌థ్యంలో భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఉగ్ర‌దాడిలో 40 మందికి పైగా జ‌వాన్లు మ‌ర‌ణించ‌డంతో దేశ వ్యాప్తంగా పాక్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతోంది. ఇప్ప‌టికే పాక్‌తో ఉన్న ఆర్థిక‌, వాణిజ్య సంబంధాలు భార‌త్ తెంచుకుంది. ఉగ్ర‌దాడి ప్ర‌భావం ఇప్పుడు క్రికెట్‌పై ప‌డింది. పాకిస్థాన్‌తో ఇప్పట్లో ద్వైపాక్షిక సిరీస్ ఆడే ప్రసక్తే లేదని ఇప్పటికే ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు. అయితే వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడాల్సిన మ్యాచ్‌పైనే సందేహాలు ఉన్నాయి.

ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా జూన్ 16న పాకిస్థాన్‌తో టీమిండియా ఆడాల్సి ఉంది. ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో పాక్‌తో మ్యాచ్ ఆడ‌వ‌ద్ద‌ని ఇప్ప‌టికే వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. దీనిపై బీసీసీఐ స్పందించింది. ఆ సమయానికి కూడా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత ప్రభుత్వం నో చెబితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. అప్ప‌టి క‌ల్ల ప‌రిస్థితుల్లో మార్పు రావచ్చ‌ని ఆశిస్తోంది. ఐసీసీకి దీనితో ఎలాంటి సంబంధం లేదు. అప్పటికి కూడా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌తో మ్యాచ్ వద్దంటే మాకు కూడా మరో మార్గం లేద‌ని తెలిపింది.

ఒకవేళ అది ఫైనల్ మ్యాచ్ అయితే ఆడకుండానే పాక్ వరల్డ్‌కప్ గెలుస్తుంది. పాయంట్ల‌న్ని పాక్‌కే వెల్తాయి. పుల్వామా దాడిలో అమరవీరులైన జవాన్లకు అటు ఐసీసీ కూడా నివాళులర్పించింది. అయితే వరల్డ్‌కప్ షెడ్యూల్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. ఆట అందులోనూ క్రికెట్ మనుషులను దగ్గర చేస్తుంది. అందుకే ఆ దిశగా మేము సభ్య దేశాలతో కలిసి నడుస్తాం అని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -