ప్రియుడి ఘాతుకం….అనుమానంతో ప్రియురాలిని నమ్మించి హతమార్చాడు

420
Crime news : Boy friend killed girl friend in khammam
Crime news : Boy friend killed girl friend in khammam

ప్రేమించిన పాపానికి ఓ యువతి బలైంది. ప్రేమించిన యువతి అడ్డుతొలగించుకోవడంకోసం నమ్మించి కొండ గుట్టపైకి తీసుకెల్లి అత్యచేశాడు ప్రేమికుడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని కుప్పెనకుంట్లకు చెందిన తేజస్విని (20)గా గుర్తించారు. చివరికి గుట్టు రట్టు కావడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు..ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కుప్పిన కుంట్ల గ్రామానికి చెందిన కావిటి తేజస్విని (20), సత్తుపల్లికి చెందిన నితిన్‌లు గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్‌ కళాశాలో పాలిటెక్నిక్‌ చదివేవారు. ఆసమయంలో ఇద్దరూ ప్రమేపలో పడ్డారు. పాలిటెక్నిక్‌ తర్వాత నితిన్‌ ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరగా, తేజస్విని కొన్ని సబ్టెక్టు తప్పడంతో ఇంట్లోనే ఉంటోంది.

వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో పోలీసుల చేత కౌన్సెలింగ్ ఇప్పించినట్లుగా తెలుస్తోంది.అయితే కౌన్సెలింగ్ తర్వాత కూడా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని… ఇరువురికి కొద్దిరోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం.

అయితే తేజస్విని ఇటీవల వేరే యువకుడితో చనువుగా ఉంటోందని అతడికి అనుమానం కలిగింది. దీనిపై ఇద్దరూ చాలాసార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఆదివారం తేజస్వినికి ఫోన్ చేసిన నితిన్ కొంచెం మాట్లాడాలని చెప్పి ఆమెను బైక్‌పై లంకపల్లి గుట్టలపైకి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన నితిన్ ఆమె గొంతు నులిచి చంపేసి మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు

కుమార్తె కనిపించక పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు తేజస్విని కాల్‌డేటాలో నితిన్‌ నంబర్‌ గుర్తించారు. నిందితుడు నితిన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Loading...