Friday, April 19, 2024
- Advertisement -

తీవ్ర తుఫాన్‌గా మారిన ‘ఫ‌ణి’

- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్పపీడనం వాయుగుండంగా మారి, తుపానుగా మారింద‌ని వాతవార‌ణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘ఫ‌ణి’ అని నామాకర‌ణం చేసిన సంగ‌తి తెలిసిందే. ‘ఫ‌ణి’ తుపాను ఇప్పుడు తీవ్ర తుఫాన్‌గా మారింద‌ని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్ర‌స్తుతం ఈ తుపాన్ చెన్నైకి తూర్పు ఆగ్నేయానికి 690 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 760 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంద‌ని వాతవార‌ణ శాఖ తెలిపింది. మ‌రికొద్ది గంట‌ల్లోనే ఇది పెను తుపానుగానూ మారుతుందని తెలుస్తోంది. ఫ‌ణి తుపాను ఖ‌చ్చింత‌గా ఎక్క‌డ తీరం దాటుతుందో చెప్ప‌లేక‌పోతున్నారు.

ఎందుకంటే గంట‌, గంట‌కు ఇది త‌ను తీరు మార్చుకోవ‌డంతో ఇది ఖ‌చ్చింత‌గా ఎక్క‌డ తీరం దాటుతుందో చెప్ప‌లేక‌పోతున్నారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం మృత్యుకారులు ఎవ‌రు కూడా స‌ముద్రంలోకి వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చరించింది. తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా పున‌ర‌వాస కేంద్రల‌కు త‌ర‌లిస్తోంది ప్ర‌భుత్వం. తీరం దాటే స‌మ‌యంలో ఫ‌ణి విధ్వంసం సృష్టించే అవ‌కాశం ఉంద‌ని వాతవార‌ణ శాఖ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -