Friday, March 29, 2024
- Advertisement -

ఏపీకీ పొంచి ఉన్న మ‌రో భారీ తుఫాన్ గండం…

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను గండం పొంచి వుంది. దక్షిణ మధ్య బంగాళాఖాతం, హిందూ మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. తిత్లీ తుఫానునుంచి కోలుకోక ముందే మ‌రో తుఫాను పొంచి ఉండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇది కృష్ణా జిల్లా మచిలీపట్నంకు 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ నెల 15 నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపుగా రానుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి దక్షిణ కోస్తా తీరం వెంబడి గాలులు పెరిగే అవకాశం ఉంది. 15, 16న దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని.. గంటకు 70 నుంచి 100 మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు అధికారులు.వాయుగుండం హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. ముంబై నుంచి అమరావతి చేరుకున్న సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -