Friday, March 29, 2024
- Advertisement -

ఏపీకీ పొంచి ఉన్న ‘‘పెథాయ్’’ తుఫాను..

- Advertisement -

తిత్లీ తుఫాన్ విధ్వంసం నుంచి ఇంకా కోలుకోకముందే..ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఉత్తరాంధ్రలో తిత్లీ అల్లకల్లోలం సృష్టిస్తే..ఇప్పుడు దక్షిణాంధ్రపై పంజా విసిరేందుకు మరో తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి శాస్త్రవేత్తలు ‘‘పెథాయ్’’గా నామకరణం చేశారు.

మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశలో 1250 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. మరో 12 గంటల్లో అది బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడి తుఫాన్‌గా మారుతుందని హెచ్చరింది.

అమరావతిలో అధికారులతో మంత్రి లోకేశ్ సమావేశమై తుఫాన్‌పై సమీక్షించారు. తిత్లీ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందిగా తీర ప్రాంతా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచనలు చేసింది.

తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుఫాను తీవ్రత దృష్ట్యా ఏపీలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీని ప్రభావం తెలంగాణపైనా పడింది. రాజధాని హైదరాబాద్‌లో అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. 16, 17 కోస్తాంధ్రాపై పెథాయ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. తీర ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -