Thursday, April 18, 2024
- Advertisement -

కరోనా తగ్గిందని లైట్ తీసుకోకండి : మోడీ

- Advertisement -

దేశంలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక సూచనలు చేశారు. కరోనాని ప్రజలు అంత లైట్ గా తీసుకోవద్దని.. వాక్సిన్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. భారత్ లో కరోనా కేసులు తక్కువగానే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు తగ్గినా సరే జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందేనని మోడీ హేచ్చరించారు.

మంగళవారం ఆయన కేంద్ర మాజీ మంత్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్ వచ్చే వరకూ అప్రమత్తత తప్పదు. భౌతిక దూరం పాటించాలి. కోవిడ్-19 నిబంధనలు విధిగా పాటించాలి. వైరస్ ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నది. మాస్క్ లు వేసుకోవడం భౌతిక దూరం పాటించడంలో కొందరు అలసత్వం చూపుతున్నారు. ఇది ఏమాత్రం తగదు. కరోనా ప్రమాదం కొనసాగుతోందని.. మహారాష్ట్రలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది’ అని ప్రధాని సూచించారు.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55342 కొత్త కేసులు నమోదయాయి. గత రెండునెలల కాలంలో ఇంత తక్కువస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గత నెలలో 90000కు పైగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవగా తాజాగా ఆ సంఖ్య సగానికి పడిపోయింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 71.75 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 109856 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

సుచరిత హయాంలో నేరాలు ఎక్కువగా జరిగాయా..?

మంత్రి జయరాం జైలుకి వెళ్లక తప్పదా..?

నూతన్ నాయుడు ని ఇప్పటిలో పోలీసులు వదిలేలా లేరే..?

యాసంగిలో పంటల సాగు, కొనుగోలు పై కేసీఆర్ సమీక్ష

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -