డేంజర్ లో భారత్.. ఒక్కరోజే 2003 మంది మృతి..!

1470
Dangerous Disease In India
Dangerous Disease In India

అన్ని దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత ఉంది. అయితే మొదటితో పోలీస్తే కొన్ని దేశాల్లో వైరస్ వ్యాప్తి కొంత తగ్గిముఖం పట్టినప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. బుధవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 82.64 లక్షలకుపైగా చేరుకుంది. ఈ వైరస్ కారణంగా 4.38 లక్షల మంది చనిపోయారు. ఇప్పటి వరకు 43.21 లక్షల మంది కోలుకున్నారు. ఇక ఇండియాలో ఈ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా మరో 10974 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

దేశంలో మొత్తం నమోదైన కేసులు 354065కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 2003 మంది చనిపోవడంతో.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 11903కి చేరింది. మరణాల రేటు 2.9 శాతం నుంచి 3.4 శాతానికి పెరిగింది. ప్రస్తుతం రోజూ 300 మంది లోపు చనిపోతున్నారు. అలాంటిది నిన్న ఒక్క రోజే… 2003 మంది చనిపోవడం షాకింగ్ విషయమే అని చెప్పాలి. ప్రస్తుతం దేశంలో రికవరీ కేసులు 186934గా ఉన్నాయి. రికవరీ రేటు 52.8 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 155227గా నమోదయ్యాయి. ఇక ఏపీ విషయంకు వస్తే.. గత 24 గంటల్లో 15911 శాంపిల్స్ టెస్ట్ చెయ్యగా… 193 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5280. ఇప్పటివరకూ 2851 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ తో మొత్తం 88మంది చనిపోయారు. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2341గా ఉంది. ఇక తెలంగాణలో రోజుకు 200కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 213 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5406 కి చేరింది. తెలంగాణలో ఇప్పటి వరకు 3027 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2188 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా బారిన పడిన చనిపోయిన వారి సంఖ్య 191కి చేరింది.

దేశానికి మేఘా రక్షణ కవచం

అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?

జేసీ ప్రభాకర్‌ రెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డి అరెస్ట్‌

కార్మికులు లేకున్నా ఆగని ‘మేఘా’ పనులు

Loading...