Friday, March 29, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో శుభవార్త

- Advertisement -

గడిచిన పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వాన రెండు మూడు రోజులు తెరిపినిచ్చిన సంగతి తెలిసిందే.. రెండు మూడు రోజులుగా ఎండకాస్తోంది. అయితే తాజాగా వాతవరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో శుభవార్తను అందించింది.

తాజాగా బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతం సోమవారం అల్పపీడనం ఏర్పడింది. భూమికి 7.6 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇక అల్పపీడన ప్రభావం మంగళవారం మధ్యాహ్నం నుంచే కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని హత్నూర్, ఇబ్రహీంపేట, కొమ్మెరలో వరుసగా 29.3 మి. మీటర్లు, 20మీమీ, 39మి.మీ ల వర్షపాతం నమోదైంది.

ఇక ఇప్పటికే బాగా తడిసి ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాసానికి తరలిస్తున్నారు.

ఇక ఏపీలోని గోదావరి పరివాహక ముంపు, లంక గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే వరద ముప్పు నుంచి కోలుకుంటున్నారు. ఇప్పుడు మరో అల్పపీడనం అని చెప్పడంతో వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకీడుస్తున్నారు. బాహ్య ప్రపంచంతో ఇప్పుడిప్పుడు పునరుద్దరణ అవుతున్న వాళ్లకు మరో అల్పపీడనం గుదిబండగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -