Wednesday, April 24, 2024
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆచి తూచి అడుగు

- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు తగ్గించారు. ఇంతకు ముందు ప్రైమరీ ఎన్నికల కోసం చేసిన ప్రచారంలో ముస్లీములపై పరుష వ్యాఖ్యలతో ప్రసంగించిన ట్రంప్ ఆ తర్వాత తన వాగ్దాటిని మార్చారు. బ్రిటన్ మేయర్ గా ఓ ముస్లీం ఎన్నిక కావడంతో ట్రంప్ తన ప్రచారంలో ఆచి తూచి మాట్లాడుతున్నారు.

ఇంతకు ముందు ముస్లీములకు ఇమిగ్రేషన్ రద్దు చేయాలని చెప్పిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చి అది కేవలం తన సలహా మాత్రమేనంటున్నారు. ‘మేం చాలా తీవ్రమైన సమస్యలో ఉన్నాం. అందుకే నిషేధం తాత్కాలికంగా ఉంటుంది. అయితే, అది ఇప్పటి వరకు చేయలేదు. ఎవరూ అలా చేయలేదు.

అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు ఇది కేవలం నా సలహాగానే ఉంటుంది’ అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. ప్రపంచం మొత్తం ముస్లీముల కారణంగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ను అమెరికాలో అడుగుపెట్టేందుకు మినహాయింపు ఉంటుందనిట్రంప్ప్రకటించిన మర్నాడే ముస్లింల గురించి ఎంతో ఉదారంగా  మాట్లాడటం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -