ట్రంప్ ప్రయాణించే కారు ఖరీదు ఎంతో తెలుసా ?

1020
Donald Trump Beast Car Features
Donald Trump Beast Car Features

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు వచ్చి మోతేరా స్టేడియంలో ప్రసంగం ముగించారు. ఇక ప్రస్తుతం ఆయన ఆగ్రాలోని తాజ్ మహల్ కు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ 50 కి.మీలు తన నల్లటి కారులోనే వెళ్లారు. అయితే ఇది మాములు కారు కాదు.

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే అత్యాధునిక అత్యంత భద్రమైన కారు. ఈ కారు పేరు బీస్ట్. ప్రపంచంలోనే హైఎండ్ టెక్నాలజీ భద్రత అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఈ బీస్ట్ కారు డోర్స్ మందమే 8 అంగుళాలు ఉంటుంది. శక్తివంతమైన బాంబు పేలుళ్లను కూడా ఈ డోర్స్ తట్టుకుంటాయట. బుల్లెట్ ఫ్రూఫ్ టెక్నాలజీ గ్లాస్ తో ఈ కారును రూపొందించారట. ఇక ఈ కారు నడిపేందుకు డ్రైవర్ ను అమెరికా కేంద్ర నిఘా సంస్థ సీఐఏ ఎంపిక చేస్తోంది. సీక్రెట్ ఏజెంట్ మాత్రమే ఈ కారు డ్రైవర్ గా వ్యవహరిస్తాడు. మిగిలిన వారు ఈ కారును కనీసం ముట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు.

ఈ కారును అమెరికాలోని జనరల్ మోటార్స్ తయారు చేస్తుంది. ఇలాంటి మొత్తం 12 కార్లు ట్రంప్ కాన్వాయ్ లో ఉంటాయి. ట్రంప్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట బీస్ట్ కార్లు వెళతాయి. ఇక ఈ కారు ఖరీదు అక్షరాల వంద కోట్లు. 8 టన్నుల బరువు ఉంటుంది. ఇంధన ట్యాంకు పేలకుండా భద్రత ఉంది. కారు కింద బాంబు పేలినా ఏమీ కాదు. కనీసం కుదుపు కూడా ఉండదు. ఇక ఈ కారు నుంచే ఎదుటివారిపై దాడి చేసేందుకు డ్రైవర్ సీటు పక్కనే డోర్ వద్ద అత్యాధునిక ఆయుధాలుంటాయి. ఇలా అత్యంత భద్రత కలిగిన కారులో ట్రంప్ ప్రయాణిస్తారన్నమాట.

Loading...