హాట్ కేకుల్లా అమ్మ‌డ‌వుతున్న ట్రంప్ టాయిలెట్ బ్ర‌స్‌లు..రూ.1683 మాత్రమే

510
Donald Trump Original Trump Toilet Brush Make Toilet Great
Donald Trump Original Trump Toilet Brush Make Toilet Great

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాలతోనే రోజులో ఎక్కువసేపు సహవాసం చేస్తుంటారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎలా దూసుకుపోయారో అంతే రీతిలో విమ‌ర్శ‌లు ఎదుర్కొన‌డంతోపాటు…ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌త‌రేక‌త వ‌చ్చింది. అయితే ట్రంప్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను గుర్తించిన ఓ బ్ర‌ష్ ల కంపెనీ ట్రంప్ ముఖచిత్రంతో టాయిలెట్ బ్రష్ ను రూపొందించింది ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి పెట్టింది. అలా అమ్మ‌కానికి పెట్టిందో లేదో అవ‌న్నీ హీట్ కేక్‌ల్లా అమ్మ‌డు పోయాయి.

ఇప్పుడే కాకుండా గ‌తంలో కూడా ట్రంప్ ముఖ చిత్రంలో అనేక ఆట‌వ‌స్తువులను కూడా కంపెనీలు రూపొందించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు టాయిలెట్‌ల‌లో ఉప‌యోగించే టిష్యూ పేప‌ర్‌ల‌ను కూడా ట్రంప్ ముఖంతో త‌యారు చేసిన సంగ‌తి తెలిసిందే. టాయిలెట్ ట్రంప్ బ్ర‌ష్‌ల‌కోసం అమెరికాలో ట్రంప్ వ్యతిరేకులు ఎగబడి మరీ వీటికి ఆర్డర్లు ఇస్తున్నారు.

ఇలా హ‌ట్ కేకుల్లా అమ్మ‌డు పోవ‌డంతో కంపెనీ కుషీగా ఉంది. ప్రస్తుతం ఆర్డర్ ఇచ్చినవారు తమ బ్రష్ ను అందుకోవడానికి 6-8 వారాల సమయం పట్టేంతగా వీటికి డిమాండ్ ఏర్పడింది. న్యూజిలాండ్ లోని ఓ కంపెనీ వీటిని తయారుచేస్తుండగా, ETSY.com వెబ్ సైట్ లో అమ్ముతున్నారు. అన్నట్లు ఒక్కో ట్రంప్ టాయిలెట్ బ్రష్ ధర జస్ట్ రూ.1683 మాత్రమే.

Loading...