ఇలా చేస్తే కరోనా ని అంతం చేయొచ్చు..శాంతమే రక్షా..?

272
donot talk loudly corona not come
donot talk loudly corona not come

కరోనా మహమ్మారి భారతదేశాన్ని ఎంతలా పట్టి పీడిస్తుందో అర్థం చేసుకోవచ్చు.. ఇప్పటికే మరణాలు రోజు రోజు కి పెరిగిపోతుంటే పాజిటివ్ కేసులు సైతం లక్షల్లో పరిగిపోతున్నాయి.. దాంతో ప్రభుత్వాలు ఈ మహమ్మారిని ఎలా తగ్గించాలో తెలీక తలలు పట్టుకుంటున్నాయి.. కాగా ప్రస్తుతం మునుపటిలా కరోనా ప్రభావం లేదనే చెప్పాలి.. గాలి ద్వారా లేదా ఎవరైనా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. సాధారణంగా ఒకరినొకరు ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు.. ఇలా మాట్లాడిన సమయంలో వారి నోటిలోని తుంపర్లతో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. అందుకే మాట్లాడే సమయంలో గట్టిగా మాట్లాడొద్దంటోంది ఓ కొత్త అధ్యయనం.. గట్టిగా అరవకుండా నెమ్మదిగా మాట్లాడితే కరోనా వ్యాప్తి చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపింది.

అందులోనూ వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని, లోపలి గాలి, బయట గాలితో ఎప్పటికప్పుడూ ప్రెష్ అయ్యేలా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి ప్రభావాన్ని సైంటిస్టులు తెలిపారు. నిశ్శబ్దంగా మాట్లాడటం వల్ల ప్రాణాంతకమైన కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గిపోతుందని అధ్యయనం కనుగొంది. ఆస్పత్రి లేదా వెయిటింగ్ రూములు లేదా భోజన సదుపాయాలు వంటి అధిక-ప్రమాదకరమైన ఇండోర్‌లో కరోనా వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.

జూలై నెలలో సాంగ్ రెహార్షల్ సమయంలో లేదా రెస్టారెంట్లు లేదా ఫిట్‌నెస్ క్లాసుల్లో ఉన్నప్పుడు ఏరోసోల్ ప్రసారం చేసే అవకాశాన్ని గుర్తించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల్లో పేర్కొంది. ఎవరైనా మాట్లాడేటప్పుడు బయటకు వచ్చిన సూక్ష్మ నోటితుంపర్లు త్వరగా ఆవిరైపోయి వైరస్ పెద్ద ఏరోసోల్ కణాలను వదిలివేస్తాయి. బిగ్గరగా మాట్లాడేప్పుడు విడుదలయ్యే 35 డెసిబెల్స్ లేదా గుసగుసలాడుకోవడం విడుదలయ్యే డెసిబెల్స్ మధ్య వ్యత్యాసాన్ని పరీక్షించారు.

Loading...