నీలి రంగును కోల్పోయి మ‌రో రంగులో క‌నిపించ‌నున్న భూమి….

488
Earth May Lose its Distinct Blue Colour in Another 80 Years : Says MIT
Earth May Lose its Distinct Blue Colour in Another 80 Years : Says MIT

రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం భూమికి పెను శాపంగా ప‌రిణ‌మించింది. ఇలానే కొన‌సాగితే మ‌రో 80 సంవ‌త్స‌రాల్లో భూమి త‌న నీలి రంగును కోల్పోనుంద‌ని అమెరికాకు చెందిన మ‌సాచుటెస్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నిర్వ‌హించిన స్ట‌డీలో తేలింది. పెరిగిపోతున్న కాలుష్యం కార‌ణంగా భూమిపై పెనుమార్పులు సంభ‌వించ‌నున్నాయ‌ని తెలిపింది.

కాలుష్యం పెరిగి పోవ‌డం వ‌ల్ల స‌ముద్రంలోని సూక్ష్మ జీవాలు, వృక్షాలు వాతావ‌ర‌ణ ప్ర‌భావానికి లోనుకానున్న‌ట్లు ఆ ప‌రిశోధ‌న వెల్ల‌డించింది. భూమిపై క‌నిపించే నీలి, హ‌రిత ప్రాంతాలు ఇక త‌మ ప్ర‌భ‌ను కోల్పేయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స్ట‌డీలో తేల్చారు. 21వ శ‌తాబ్ధం చివ‌ర వ‌ర‌కు దాదాపు 50 శాతం స‌ముద్రాల రంగు మార‌నున్న‌ట్లు ఆ ప‌రిశోధ‌న నిర్వ‌హించిన స్టీఫెన్ డుకెవిజ్ తెలిపారు. స‌ముద్రాల్లోని సూక్ష జీవులు వెలుతురును గ్ర‌హించే తీరును మార్చ‌కుంటాయ‌ని….దాని ఫ‌లితంగా పుడ్ స‌ర్కిల్‌లో మార్పులు వ‌స్తాయ‌ని హెచ్చ‌రించింది.

Loading...