Saturday, April 20, 2024
- Advertisement -

నీతి అయోగ్ స‌భ్యుడు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఈ స‌ల‌హా మండ‌లి….

- Advertisement -

దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక పురోగతి నెమ్మదించిందన్న అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఆర్థిక సలహాదారుల మండలిని ఏర్పాటు చేశారు. ఈ అడ్వయిజరీ కౌన్సిల్‌కు ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్‌ దేబ్‌రాయ్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మండలిలో సుర్జీత్‌ భల్లా, రథిన్‌ రాయ్‌, ఆషిమా గోయల్‌, రతన్ వతల్‌ సభ్యులుగా ఉండనున్నారు.

ఢిల్లీలో నిర్వ‌హిస్తోన్న‌ భారతీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం ముగిసింది. ఇందులో భాగంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపారు. ఆర్థిక వ్య‌వ‌హారాలతో పాటు ప‌లు అంశాల‌పై ప్రధానికి స‌ల‌హాలు ఇవ్వ‌డానికి స‌లహా మండ‌లిని నియ‌మించారు. . దేశంలోని కీలక అంశాలపై కూడా ప్రధానికి స‌ల‌హా సంఘం సూచ‌న‌లు ఇస్తుంది. స‌మ‌యానుకూలంగా నివేదిక‌లు కూడా ఇస్తుంది.

నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందనే అంచనాలు ఉన్నాయ‌ని సాక్షాత్తు ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇచ్చేందుకు ప్ర‌ధాని ఈ సలహాదారుల మండలిని ఏర్పాటుచేశారు.

ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 1,400 ఎమ్మెల్యేలు, 280 మంది ఎంపీలు
2,500 బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -