విషాదం: శ్రీశైలం పాతాళగంగలో వృద్ధ దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

1307
Elderly couple Commit Suicide in Srisailam Pathala ganga
Elderly couple Commit Suicide in Srisailam Pathala ganga

ప్రముఖ శైవ‌క్షేత్రం శ్రీశైలంలో వృద్ధ దంపతులు పాతాళగంగలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారికి ఏం క‌ష్ట‌మొచ్చిందో ఏమోగానీ ఇద్ద‌రు క‌లిసి పాతాళ‌గంగ‌లో దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొందారు. వృద్ధుల మృతదేహాలు సోమవారం తెల్లవారుజామున‌ నీటిలో తేలియాడుతుండడంతో మత్స్యకారులు గ‌మ‌నించి పోలీసులకు సమాచారం అందించారు.

ఎస్సై వరప్రసాద్‌ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలం వద్దకు చేరుకొని నీటిలోని మృతదేహాలను వెలికితీశారు. మృతుల వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. వీరి వయసు సుమారు 65 సంవత్సరాలు పైబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మృతులు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. నిన్న రాత్రి పాతాళగంగలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వృద్ధ జంట రెండ్రోజుల కిందట శ్రీశైల దర్శనానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం పాతాళగంగ స్నానాల ఘాట్ల వద్ద కూడా సంచరించి అనంత‌రం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌ట్టు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సమస్యల వల్లనే ఆత్మహత్య పాల్పడి ఉంటారని అంచ‌నాకు వ‌చ‌చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విసున్నిపెంట ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు.

Loading...