Thursday, March 28, 2024
- Advertisement -

విప‌క్షాల‌కు షాక్ ఇచ్చిన ఈసీ….

- Advertisement -

ఓట్ల లెక్కింపు విష‌యంలో విప‌క్షాల‌కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. గ‌త కొన్ని రోజులుగా 50శాతం వీవీప్యాట్స్ లెక్కించాల‌ని నానాయాగి చేసిన 21 విప‌క్షాల‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన స‌గంతి తెలిసిందే. చివ‌ర‌కు కూడా ఓట్ల లెక్కింపులో భాగంగా ఈవీఎం ఓట్ల కంటే ముందు వీవీ ప్యాట్లను లెక్కించాలని చేసిన ప్ర‌తిపాద‌న‌ను ఎన్నిక‌ల కమిష‌న్ తిరస్క‌రించింది.వీవీ ప్యాట్లను ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే లెక్కిస్తారని మరోసారి స్పష్టం చేసింది.

ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్‌, ఆ త‌ర్వాత ఈవీఎంలు, చివ‌ర‌గా వీవీప్యాట్ల‌ను లెక్కించ‌నున్నారు. వీవీప్యాట్ల ఎంపిక లాట‌రీ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంది. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి 5 వీవీప్యాట్లు లెక్కించాల‌ని ఇటీవ‌ల సుప్రీం తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈసీని క‌లిసిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, డీఎంకే మహిళా నేత కనిమొళి, వామపక్ష ప్రముఖులు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -