Friday, March 29, 2024
- Advertisement -

మహారాష్ట్ర,హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్…

- Advertisement -

త్వరలో మహారాష్ట్ర,హర్యాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది ఈసీ. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రోజు అంటే అక్టోబర్ 21న ఎన్నికలను నిర్వహిస్తామని ఈసీ ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. అక్టోబర్‌ 24న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 27న విడుదల కానుందని ఆయన చెప్పారు. అదే రోజునుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అక్టోబర్ నాలుగో తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది.

మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 సీట్లకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. మహారాష్ట్రలో 8.94 కోట్ల మంది, హర్యానాలో 1.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. హర్యానా అసెంబ్లీ కాలపరిమితి… నవంబర్ 2తో ముగుస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 9తో ముగుస్తుంది. ప్రచారం సమయంలో ప్లాస్టిక్ వాడొద్దన్న ఈసీ… మహారాష్ట్రలో 1.8 లక్షల ఈవీఎంలు, హర్యానాలో 1.30 లక్షల ఈవీఎంలు వాడనున్నట్లు తెలిపింది.సమస్యాత్మక ప్రాంతాలైన గడ్చిరోలి, గొండియాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక ఎన్నికల ప్రచారానికి ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించొద్దని రాజకీయ పార్టీలకు సునీల్‌ ఆరోరా సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -