Thursday, April 25, 2024
- Advertisement -

అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్….లేదంటే జైలుకే

- Advertisement -

ఆర్ కామ్ అధినేత అనీల్ అంబాని తీవ్ర గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. న‌ష్టాల‌తో కొట్టుమిట్టాడుతున్న స‌మ‌యంలో అనిల్‌కు మ‌రో ఎదురు దెబ్బ గ‌లిలింది. స్వీడన్‌కు చెందిన టెలికం సంస్థ‌ ఎరిక్‌సన్‌ ఇండియా వివాదంలోసుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎరిక్‌సన్‌కు 4 వారాల్లోపు రూ.453 కోట్లు చెల్లించాలని అనిల్ అంబానీని సుప్రీం కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్‌కాం ఎరికసన్‌ బ​కాయిలను చెల్లించడంలో ఇప్పటికే రెండుసార్లు విఫలమైంది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు తగిన మూల్యం చెల్లించాలని వ్యాఖ్యానించింది. ఇందుకు అనిల్‌ అంబానీతో పాటు ఇద్దరు డైరెక్టర్లను (రిలయన్స్ టెలికం ఛైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ అధ్యక్షురాలు ఛాయా విరాని) ఈ కేసులో దోషులుగా సుప్రీం తేల్చింది. ఒక్కొక్కరికీ కోటి రూపాయల జరిమానా కూడా విధించింది. 4 వారాల్లో ఈ సొమ్మును చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. మరోవైపు అనిల్‌ అంబానీని అరెస్ట్‌ చేయాలన్న ఎరిక్‌సన్‌ పిటీషన్‌ను తోసిపుచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -