Thursday, April 25, 2024
- Advertisement -

కోడెల అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబసభ్యులు…

- Advertisement -

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతదేహానికి ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.మధ్యాహ్నం 1గంట తర్వాత నరసరావుపేట స్వర్గ పూరి శ్మశాన వాటికలో అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కుటుంబం మాత్రం అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించారు.

టీడీపీ నేతలతో, కార్యకర్తలతోనే కోడెలకు అంత్యక్రియలు జరుపుకుంటామని జరుపుకుంటామని చెబుతున్నారు. కోడెల ఆత్మహత్యకు కారణం వైసీపీ ప్రభుత్వం పెట్టిన వేధింపులేనని ఆరోపించారు. ఇవాళ కంటితుడుపు చర్యగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అవసరం లేదని కోడెల కుటుంబసభ్యులు పలువురి వద్ద తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -