మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యా …

227
Ex Speaker Kodela sivaprasad rao Commit Suicide
Ex Speaker Kodela sivaprasad rao Commit Suicide

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. వెంటనే కుటుంబీకులు బసవతారకం ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను ఐసీయూలో ఉంచిన వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. స్వయంగా శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని డాక్టర్లు ప్రకటించిన కొద్ది సేపటికే ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు.

కొంతకాలంగా వరుస కేసులతో సతమతమవుతున్న కోడెల శివప్రసాదరావు… తీవ్ర మనస్థాపం కారణంగానే ఆ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.కోడెల శివ ప్రసాద రావుకు ఇటీవలే గుండె పోటు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరులో కొద్ది రోజులపాటు తన అల్లుడికి చెందిన హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు. రెండు రోజుల క్రితమే ఆయన హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం.

Loading...