Saturday, April 20, 2024
- Advertisement -

సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన టీడీపీ మాజీ ఎంపీ

- Advertisement -

జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత. నిత్యం ఏదోకొ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తుంటారు. సుదీర్ఘంగా కాంగ్రెస్‌లో ఉన్న జేసీ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలోకి వెల్లి అనంత‌పురం ఎంపీగా గెలుపొందారు. సీన్ క‌ట్ చేస్తే మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌న‌కు బదులు త‌న కొడుక్కి ఎంపీ సీటు ఇప్పించుకొని బొక్క బోర్లా ప‌డ్డాడు.

ఎంపీగా ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్‌పై జేసీ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు అన్ని ఇన్నీ కావు. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న జేసీ.. తాజాగా జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జగన్‌ అంటే ఒంటి కాలుపై లేచి విమర్శలు చేసే దివాకర్ రెడ్డి.. తన విమర్శల్లో వేడిని కాస్త తగ్గించారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తాను జగన్‌పై రాజకీయ విమర్శలు చేశానే తప్ప.. ఎప్పుడూ ద్వేషించలేదన్నారు. ‘జగన్ మావాడే ’అంటూనే.. పార్టీ మారానుకోవడం లేదంటూ ట్విస్ట్ ఇచ్చారు.ఎప్పుడూ జగన్‌పై నిప్పులు చెరిగే జేసీ దివాకర్ రెడ్డి.. ఈసారి మాత్రం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.రాజకీయ విమర్శలు చేశానే తప్ప.. ద్వేషించడం లేదంటూ ట్విస్ట్ ఇచ్చారు.

ప్రధానమంత్రి మోడీతో జగన్ వ్యవహరిస్తున్న తీరును జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసించారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు రాష్ట్రానికి సుభ‌సూచిక‌మ‌న్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం… దివాకర్ రెడ్డి కుటుంసభ్యులు ఇద్దరూ కూడ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఈ తరుణంలో జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -