ఇండియా టుడే తాజా స‌ర్వే….వైసీపీకీ, టీడీపీ, జ‌న‌సేన గెలిచే ఎంపీ స్థానాలు

3434
Exit poll 2019: India-Today Exit poll servey in Andhra Pradesh
Exit poll 2019: India-Today Exit poll servey in Andhra Pradesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని మెజారిటీ జాతీయ స‌ర్వేలు స్ప‌ష్టం చేశాయి. ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కే ప‌ట్టంక‌ట్టారాని తెలిసింది. అన్ని స‌ర్వేసంగ‌తులు ఎలా ఉన్నాఇప్పుడు ఇండియా టుడే స‌ర్వేపైనె అంద‌రి చూపు ఉంది. ఇండియా టుడే కూడా కేంద్రంలో బీజేపీ ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనాలతో సీట్ల లెక్కను చెప్పింది. అయితే తాజాగా మంగళవారం మరింత వివరంగా ఏపీలో వైసీపీ – టీడీపీ – జనసేన గెలిచే సీట్లపై సర్వే రిపోర్టును విడుదల చేసింది.

ఇండియా టుడే అంచ‌నాలు తెలంగాణాలో నిజ‌మ‌య్యాయి.టీఆర్ఎస్ 80కు పైగా సీట్లు వస్తాయని వేసిన అంచనా అక్షరాల వాస్తవమైంది. ఇప్పుడు ఏపీలో కూడా ఇండియా టుడే స‌ర్వే ఫ‌లితాలు కూడా నిజం కానున్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. స‌ర్వే ప్ర‌కారం వైసీపీ 18, టీడీపీ 6…? జ‌న‌సేన 1స్థానాలు గెలుచుకుంటాయ‌ని తెలిపింది. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ గెలిచే స్థానాలపై అంచ‌నాను విడుద‌ల చేసింది.

ఇండియా టుడే విడుదల చేసిన సర్వే ప్రకారంలో ఏపీలోని మొత్తం 25 లోక్ సభ సీట్లలో వైసీపీ 18 చోట్ల విజయం సాధిస్తుందని అంచనావేసింది. ఇక ఆరు సీట్లలో మాత్రం టీడీపీ – వైసీపీ మధ్య హోరాహోరీ ఉంటుందని తెలిపింది. ఇక జనసేన ఒక్క సీటులో విజయం సాధించే అవకాశాలున్నాయని తెలిపింది.

లోక్ సభ స్థానాల వారీగా చూస్తే.. కర్నూలు – నంద్యాల – బాపట్ల – ఏలూరు – అరకు – విజయనగరం – అనకాపల్లి – కాకినాడ – అమలాపురం – ఒంగోలు – నర్సాపురం – నరసారావుపేట – హిందూపూర్ – రాజంపేట – కడప – నెల్లూరు – తిరుపతి లోక్ సభ సీట్లను వైసీపీ గెలుస్తుందని ఇండియా టుడే అంచనావేసింది.

టీడీపీకి 6 చోట్ల గెలుపు అవకాశాలున్నాయని.. అది టఫ్ ఫైట్ లోనేన్న అంచనాను ఇండియా టుడే వెలువరించింది. అక్కడ కూడా వైసీపీ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయపడింది. ముఖ్యంగా గుంటూరు – విజయవాడ – అనంతపురం – చిత్తూరు – మచిలీపట్నం – శ్రీకాకుళంలలో టీడీపీ – వైసీపీ మధ్య హోరా హోరా ఉంటుందని ఇండియా టుడే తెలిపింది. విజయవాడ బరి మాత్రం టఫ్ ఫైట్ గా ఉంద‌నుంద‌ని తెలిపింది.

జ‌న‌సేన‌నుంచి విశాఖలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం గెలుపు అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే అంచనా వేసింది. జనసేన తరుఫున గెలిచే ఒక్క ఎంపీ సీటు విశాఖ కావచ్చని.. సీబీఐ జేడీకి బాగానే ఓట్లు పడ్డాయని నివేదికలో తెలిపింది.ఇలా టీడీపీ ఒక్క ఎంపీ సీటు కూడా ఖచ్చితంగా గెలుస్తుందని ఇండియా టుడే చెప్పకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది.

Loading...