Saturday, April 20, 2024
- Advertisement -

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పేళుడు..భారీగా ఆస్తి న‌ష్టం

- Advertisement -

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ లోని బ్లాస్ట్ ఫర్నెస్-3లోని బ్లోపైప్ ఒత్తిడి కారణంగా పేలిపోయింది. దీంతో భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సమీపంలో పార్క్ చేసిన ఐదు బైక్ లు పూర్తిగా కాలిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. బ్లోపైప్ పేలిపోవడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందనీ, ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని అధికారి పేర్కొన్నారు. దీనివల్ల భారీగా నష్టం సంభవించిందని వ్యాఖ్యానించారు.

ముంద‌స్తుగా ప్రొడ‌క్ష‌న్ ఆపేశారు. పేలుడుకు సంబంధించిన కార‌ణాల‌ను విచారిస్తున్నారు. మూడ‌వ ఫ‌ర్నేస్‌లో ప్ర‌తి రోజు 8వేల మిలియ‌న్ ట‌న్నుల స్టీల్‌ను ఉత్ప‌త్తి చేస్తారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల వ్య‌క్తిగ‌త విచార‌ణ చేప‌ట్టాల‌ని ఐఎన్‌టీయూసీ డిమాండ్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -