Friday, March 29, 2024
- Advertisement -

క్యాబ్‌ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కండోమ్ లో అది ఉండాల్సిందే ?..పోలీసులు ఏమన్నారంటే..?

- Advertisement -

కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుుతన్నాయి. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇదలా ఉంటె ఇప్పుడు ఓ తప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాబ్‌ ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో కండోమ్ లేదన్న కారణంగా ఓ డ్రైవర్‌కు ట్రాఫిక్ అధికారులు జరిమానా విధించారని ప్రచారం జరుగుతోంది.

బైక్ మీద వెళ్లేవాళ్లకు హెల్మెట్,కారులో వెళ్లేవాళ్లకు సీటు బెల్టు లాగే..క్యాబ్ డ్రైవర్స్‌కు కార్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో కండోమ్ క్యారీ చేయడం తప్పనిసరి. లేదంటే జరిమానా విధిస్తారంటూ ఓ ఫేక్ వార్త హల్‌చల్ చేస్తోంది.ధర్మేంద్ర అనే ఓ క్యాబ్ డ్రైవర్ ఈ కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది.తన కారులోని ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో కండోమ్ లేదన్న కారణంగా జరిమానా విధించినట్టు అందులో అతను పేర్కొన్నాడు.దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వార్తపై ట్రాఫిక్ పోలీసులు ఘాటుగా స్పందించారు.అలాంటి నిబంధనలు మోటార్ వెహికల్ చట్టంలో లేవని స్పష్టం చేశారు. వదంతులను నమ్మవద్దని తెలిపారు. క్యాబ్ ఫిట్‌నెస్‌ టెస్టులో కండోమ్ గురించి ప్రశ్నించరని చెప్పారు. క్యాబ్‌లో కండోమ్‌ లేదని ఎవరికైనా జరిమానా విధిస్తే ఆవిషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పాలని సూచించారు. ఇలాంటి అసబద్దపు వార్తలు నమ్మవద్దని వాహనదారులకు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -