Wednesday, April 17, 2024
- Advertisement -

టోల్‌గేట్‌ దగ్గర ఆగక్కర్లేదు!

- Advertisement -

డిసెంబర్‌ 1 నుంచి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారుల తీరడం కనపడకపోవచ్చు. ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ విధానం అమల్లోకి వస్తుండటంతో టోల్‌గేట్‌ల వద్ద వెహికిల్స్‌ ఆగాల్సిన అవసరముండదు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్న ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ విధానం‘ఫాస్టాగ్‌’తో టోల్‌గేట్ల వద్ద చికాకులు తొలగిపోనున్నాయి.

ఈ విధానంలో వాహనాలకు నిర్ధారిత రుసుము చెల్లిస్తే ఫాస్టాగ్‌ పేరుతో స్టిక్కర్‌ రూపంలో ఉండే ప్రత్యేక ట్యాగ్‌ను ఇస్తారు. దాన్ని కారు అద్దానికి అతికించుకోవాలి. టోల్‌ గేట్‌ వద్దకు రాగానే, అక్కడి సెన్సార్లు ఆటోమేటిక్‌గా ఆ ట్యాగ్‌ నుంచి నిర్ధారిత రుసుమును మినహాయించుకుంటాయి. దీంతో ఆటోమేటిక్‌గా గేట్‌ తెరుచుకుని వాహనం ముందుకు వెళ్లేందుకు వీలు కలుగుతుంది.

ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారులపై అమలు చేస్తున్నారు. జాతీయ బ్యాంకులతోపాటు యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు పేటీఎం, అమెజాన్ ద్వారా డబ్బు చెల్లించి ఫాస్టాగ్‌ ట్యాగ్‌ పొందవచ్చు. వాహన ఆర్సీ, ఫొటోతోపాటు ఆధార్‌/పాన్‌కార్డు/ఓటర్‌ ఐడీ కార్డు జిరాక్స్‌ ప్రతులను దాఖలు చేసి ట్యాగ్‌ పొందాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర రహదారుల టోల్‌గేట్ల వద్ద ఈ విధానాన్ని అమలు చేయడంపై కొంత అయోమయం నెలకొంద.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -