కరోనా భాదితులకు ప్రభుత్వం ఏ ఫుడ్ అందిస్తుందంటే ?

902
Food Provided For Corona Virus Patients in Hospital
Food Provided For Corona Virus Patients in Hospital

ప్రపంచాన్ని మొత్తాన్ని కంటికి కనిపించని కరోనా గడగడలాడిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. భారత్ లో ఈ కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. దీనితో ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విదిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 16500 మంది ప్రాణాలు కోల్పోగా – బాధితుల సంఖ్య 3.76 లక్షలకు చేరింది.

ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 492 కి చేరింది. వీరిలో 37 మంది ఇప్పటికే కరోనా నుండి కోలుకోగా మిగిలిన వారు చికిత్స తీసుకుంటున్నట్టు కేంద్రం తెలిపింది. భారత్ లో కరోనా వల్ల 9 మంది మరణించారు. ఇకపోతే కరోనా భాదితులని దేశంలో చాలా రాష్ట్రాలు క్వారంటైన్ చేసాయి. కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం వచ్చినా కూడా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే. అయితే ఆలా కరోనా ఉందేమో అని అనుమానం ఉన్నవారికి కరోనా భాదితులకు ప్రభుత్వం ఏ విధమైన ఫుడ్ ని అందిస్తుందో ఇప్పుడు చూద్దాం.

ఉదయం : ఇడ్లీ – మినప వడ – పెసరదోస – గోధుమరవ్వ ఉప్మా – కాపీ – వాటర్ ని అందిస్తుంది. ( రోజుకొక ఐటమ్ మాత్రమే)

మధ్యాహ్నం : అన్నం – గుడ్డు – ఆకుకూరలు – అన్ని రకాల కూరగాయల కూర – సాంబారు – పెరుగు – అరటిపండు అందిస్తుంది.

స్నాక్స్ : వివిధ రకాల 100 గ్రాముల డ్రై ఫ్రూట్స్ – బత్తాయిలు – అరటి – ఆపిల్స్ – కాపీ ని అందిస్తుంది.

రాత్రి : అన్నం – గుడ్డు – పప్పు – రసం – పెరుగు -ఆకుకూరలు .

Loading...