Thursday, April 25, 2024
- Advertisement -

షాకింగ్ః 2019 ఎన్ని కల్లో బాబు ఓడిపోతేనే ఎపిలో పెట్టుబడులు అన్న ఫారెన్ ఇన్వెస్టర్స్

- Advertisement -

పెట్టుబడులు పెట్టాలనుకున్న పారిశ్రామికవేత్తలందరికీ బాబంటే అపార నమ్మకం. బాబును చూసే పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పుకు తిరిగే చంద్రబాబు అండ్ పచ్చ బ్యాచ్ మొత్తానికి షాకింగ్ న్యూస్. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతేనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడతామన్న ఫారెన్ ఇన్వెస్టర్స్. ఈ విషయాన్ని కూడా స్వయంగా చంద్రబాబుతోనే చెప్పారు. పచ్చ మీడియాతో సహా టిడిపి నాయకులందరికీ షాక్ ఇచ్చే ఈ విషయం నమ్మబుద్దికావట్లేదా? నిజమే మరి. ఈ విషయాన్ని వైఎస్ జగన్‌నో, వైకాపా నేతలో, సాక్షిపేపరో చెప్తే నమ్మాల్సిన అవసరమే లేదు. కానీ ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబునాయుడే చెప్పుకొచ్చాడు. స్వయంగా ఆయన నోటితో ఆయనే అసలు నిజాన్ని ఒప్పుకున్నారు.

తాజాగా తన డబ్బా తానే కొట్టుకునే అలవాటులో భాగంగా గొప్పగా మాట్లాడేసిన చంద్రబాబు…….ఆ మాటల సందర్భంలోనే ఈ నిజాన్ని చెప్పేశారు. తాను చాలా ఫారెన్ టూర్స్ తిరిగానని……అక్కడ చాలా మంది ఫారెన్ ఇన్వెస్టర్స్‌ని కలిశానని…….వాళ్ళను కలిసిన సందర్భంలో ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా 2019 ఎన్నికల్లో ఫలితం చూశాకే పెట్టుబడులు పెడతామని తనతో చెప్పారని స్వయంగా చంద్రబాబునాయుడే చెప్పుకొచ్చాడు.

చంద్రబాబు మాటలను కనుక విశ్లేషిస్తే 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తర్వాత నుంచీ ఆరు నెలల క్రితం వరకూ కూడా ఒక దేశ ప్రధాని తిరిగినన్ని దేశాలు తిరిగాడు.. అయితే పెట్టుబడులు మాత్రం కనీస స్థాయిలో కూడా రాలేదు. ఆయా దేశాల్లో ఇన్వెస్టర్స్‌ని కలిసినప్పుడల్లా వాళ్ళందరూ కూడా 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఫలితాన్ని బట్టి పెట్టుబడులు పెడతాం అన్నారని చంద్రబాబే చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉండగా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నవాళ్ళయితే 2014 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచీ అందరూ పెట్టుబడులు పెట్టి ఉండాలి. అలా కాకుండా బాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాదు ……..2019 ఎన్నికల ఫలితాల తర్వాత పెట్టుబడులు పెడతాం అని ఫారెన్ ఇన్వెస్టర్స్ స్వయంగా చెప్పారంటే అర్థమేంటి? 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారితేనే ఎపిలో పెట్టుబడులు పెడతాం అని డైరెక్ట్‌గా చెప్పేసినట్టే కదా. చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ మొత్తానికి అసలు మర్మం అర్థం కావడం లేదు కానీ ఆర్థిక విశ్లేషకులు మాత్రం చంద్రబాబు మాటలను ఇలానే విశ్లేషిస్తున్నారు. 20మంది ఎంపిలు ఉన్నప్పటికీ 2014 నుంచీ ఇప్పటి వరకూ ఎపికి ఏమీ తీసుకురాలేకపోయిన చంద్రబాబు………అధికార హోదాలో ప్రజల సొమ్ముతో ఎన్నో దేశాలు తిరిగినప్పటికీ కనీస స్థాయి పెట్టుబడులు తీసుకురాలేకపోయారని ఆర్థికవేత్తలు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -