కోడెల మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి….

421
Former AP Assembly Speaker Kodela Siva Prasad complete post mortem
Former AP Assembly Speaker Kodela Siva Prasad complete post mortem

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు భౌతికకాయానికి శవపరీక్ష పూర్తయ్యింది.ఉస్మానియా వైద్యులు సుమారు రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కోడెల పార్థివ దేహాన్ని బంధువులకు అప్పగించారు.కోడెల మృతి చెందడానికి ముందు కాఫీ, టిఫిన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. కోడెల పోస్ట్ మార్టమ్ ప్రక్రియను పోలీసులు వీడియో తీసినట్టు సమాచారం.

కోడెల భౌతికకాయాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు తరలించారు. అక్కడ అభిమానులు ఆయనకు నివాళులు అర్పించనున్నారు.రేపు ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి గుంటూరులోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నట్టు తెలుస్తోంది. రేపు సాయంత్రం నరసరావుపేటకు కోడెల భౌతికకాయాన్ని తరలిస్తారని, ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహిస్తారని టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Loading...