బిగ్ బాస్‌లోకి మాజీ మంత్రి లోకేష్‌….సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌

277
Former tdp Minister Nara lokesh into Bigg Boss 3 ..?
Former tdp Minister Nara lokesh into Bigg Boss 3 ..?

ఏపీ మాజీ సీఎం చ‌ద్ర‌బాబు పుత్ర‌ర‌త్నం మాజీ మంత్రి లోకేష్ కు సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. త్వ‌ర‌లో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొదలు కాబోతోంది. బిగ్ బాస్ సీజ‌న్ 3లోకి లోకేష్ వెల్తున్నారంట‌. తెలుగు స్టార్ మా ఛానల్ లో వచ్చే బిగ్ బాస్ షో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది.

మొదటి సీజన్ బిగ్ బాస్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వచ్చిన సమయంలో శివ బాలాజీ విన్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సమయంలో కౌశల్ విన్ అయ్యారు. ఈ సీజ‌న్ 3కి నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.ఇందుకు సంబంధించిన ప్రేమోలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టున్నాయి. నాగార్జున హోస్ట్ గా రావడంతో బిగ్ బాస్ పై మరిన్ని అంచనాలు పెంచుకున్నారు బిగ్ బాస్ అభిమానులు.

శ్రీ ముఖి, శ్రీ రెడ్డి, వరుణ్ సందేశ్, జాకీ అందరూ బిగ్ బాస్ లో కంటస్టెంట్లని వార్తలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ 3 కంటస్టెంట్ గా నారా లోకేష్ కూడా బిగ్ బాస్ లోకి రానున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో లోకేష్‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

ఒక నెటిజన్ నారా లోకేష్ బిగ్ బాస్ లో కి వెళ్లే దానిపై స్పందిస్తూ ” బిగ్ బాస్ లోకి నారా లోకేష్ వెళ్తే నోరు జారుడు, విమర్శలు చెయ్యడం తప్ప ఇంకా ఏమి ఉండదు” అని వ్యాఖ్య చేసారు. నారా లోకేష్ బిగ్ బాస్ లోకి వెళ్తే సూపర్ ఉంటది అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తే, మరికొందరు వైఎస్ జగన్ ని ఎవరు విమర్శిస్తారు లోకేష్ బాబు అని కామెంట్ పెడుతున్నారు.మరి లోకేష్ బిగ్ బాస్ కి వెళ్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Loading...