Tuesday, April 23, 2024
- Advertisement -

అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ క‌న్ను మూత‌….

- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్ (94) అనారోగ్యంతో కన్నుమూశారు. జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్‌ శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. హూస్టన్ లోని స్వగృహంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

తన తండ్రి మరణ వార్తను అందరికీ తెలియజేయడానికి చాలా చింతిస్తున్నానని బుష్‌ కుమారుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు జూనియర్ బుష్ ట్విట్టర్‌‌లో పేర్కొన్నాడు. ఆయన మంచి తండ్రి మాత్రమే కాదు, మంచి వ్యక్తిత్వం గల మనిషి, ఒక తత్వవేత్త, మార్గదర్శిగా తమకు నిర్ధేశం చేశారని బుష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

బుష్ కుమారుడు జార్జ్ బుష్ అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేయగా, జెఫ్ బుష్ టెక్సాస్ కు గర్నవర్ గా పనిచేశారు. మసాచుసెట్స్ లోని మిల్టన్ లో 1924, జూన్ 12న బుష్ జన్మించారు. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ)కు డైరెక్టర్ గా పనిచేశారు.

రిపబ్లికన్ పార్టీలో చేరిన బుష్ అంచలంచెలుగా పార్టీలో ఎదిగారు. నిక్సన్ హయాంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా విధులు నిర్వహించారు. అలాగే 1981-89 మధ్యకాలంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి అమెరికా 41వ అధ్యక్షుడిగా(1989-93) ప్రమాణస్వీకారం చేశారు

ఆయన పూర్తిపేరు జార్జ్ హెర్‌బర్ట్ వాకర్ బుష్1924 జూన్ 12న మస్సాచూసెట్స్ రాష్ట్రంలోని మిల్టన్‌లో జన్మించారు. అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ బుష్ 1981 నుంచి 1989 వరకు అమెరికా ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు.

కేవలం 18 సంవత్సరాలకే అమెరికా నావికాదళంలో చేరి పిన్న వయస్కుడైన పైలెట్ గా బుష్ అప్పట్లోనే చరిత్ర సృష్టించారు. కాగా, బుష్ మృతిపై పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. బుష్ కుమారుడు జార్జ్.డబ్ల్యూ.బుష్ సైతం అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -