Tuesday, April 23, 2024
- Advertisement -

టాంజానియిలో ఘోర ప్రమాదం…60 మంది అగ్నికి ఆహుతి

- Advertisement -

టాంజానియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టాంజానియా రాజధాని దార్‌ ఎస్‌ సలామ్‌కు పశ్చిమంగా వున్న మొరగొరోలో ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో 60 సజీవ దహనం అయ్యారు. దాదాపు 70 మందికి పైగా గాయాలపాలయ్యారు. మారాగోరా రిజియన్‌లోని పోర్టు పట్టణమైన దర్‌ ఈస్‌ సలమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదానికి గురైన ట్యాంకర్‌ నుంచి స్థానికులు పెట్రోల్‌ తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడున్నవారు మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేశారు.

ఆయిల్‌ కోసం వచ్చిన ఓ వ్యక్తి సిగరెట్‌ అంటించడంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు సమాచారం. టాంజానియా ఆర్థిక రాజధాని దార్‌ ఎస్‌ సలామ్‌లోని మొరోగోరో ప్రాంతంలో శనివారం పెట్రోల్ ట్యాంకర్ బోల్టా పడింది. దాంతో పెట్రోల్ ను క్యాన్ లలో నింపుకొనేందుకు స్థానికులు పెద్ద ఎత్తున చేరారు. వారిలో ఒకరు సిగరెట్ ముంటించడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. ఇప్పటివరకు 62 మంది మృతదేహాలను గుర్తించామని అధికారులు తెలిపారు.

టాంజానియాలో ఇలాంటివి జరగడం కొత్తేం కాదు. గత నెలలో నైజీరియా నార్తన్‌ బెన్యూ స్టేట్‌లో పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 45 మంది మృతి చెందారు. మే నెలలో జరిగిన పేలుడులో నైజీరియా రాజధాని నైమీలో జరిగిన ప్రమాదంలో 80 మంది మృతి చెందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -