Saturday, April 20, 2024
- Advertisement -

మిషన్ గగన్‌యాన్ భారీ ప్రాజెక్టు కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్న‌ల్‌…

- Advertisement -

ఇస్రో అంత‌రిక్ష రంగంలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. అగ్ర‌రాజ్యాల‌యిన అమెరికా, చైనా, ర‌ష్యాల‌కు ధీటుగా వ‌రుస విజ‌యాలు సాధిస్తోంది. గగన్ యాన్ ప్రాజెక్టు ద్వారా ఎప్ప‌టినుంచోఅంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించాలని భార‌త్ ప్ర‌య‌త్నిస్తోంది. భారీ ప్రాజెక్టు కావ‌డంతో దీనికి కేంద్ర అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి.

తాజాగా గగన్ యాన్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినేట్ అమోదం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టుకు రూ.10,000కోట్లును కేటాయించింది. దీని ద్వారా ముగ్గురు వ్యోమ‌గాముల‌ను అంత‌రిక్షంలోకి పంపించ‌నుంది ఇస్రో. వీరు ఏడు రోజుల పాటు అంతరిక్షంలో వుండనున్నారు. గగన్‌యాన్‌ను త్వరలోనే ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సం (ఆగస్ట్‌ 15) సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

గ‌తంలో ప్ర‌ధిని న‌రేంద్ర మోదీ కూడా 2022 క‌ల్లా అంత‌రిక్షంలోకి వ్యోమ‌గాముల‌ను ఇస్రో పంపుతుంద‌ని ప్ర‌క‌టించారు. దానికి అనుగునంగానే ఈ ప్రాజెక్టుకు అమోద ముద్ర ల‌భించింది. ఇస్రో సాంకేతిక పరిజ్ఞానంలో మేటి అయిన భారీ రాకెట్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-3( జీఎస్ఎల్‌విఎంకే -3) ద్వారా మిషన్ గగన్‌యాన్ ఆపరేషన్ చేపట్టబోతున్నారు.

భారత్ నుంచి ఇస్రో ప్రయోగిస్తున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ఇది. స‌క్సెస్ అయితే …ఇప్పటికే మానవ సహిత అంతరిక్ష మిషన్స్ నిర్వహించిన అమెరికా, చైనా, రష్యా స‌ర‌స‌న భార‌త్ నిలువ‌నుంది. గగన్ యాన్ భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష కార్యక్రమంగా చరిత్రలో నిలవనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -