బిగ్ బాస్ నిర్వాహకులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

441
Gayatri Gupta on Bigg Boss Telugu Casting Couch
Gayatri Gupta on Bigg Boss Telugu Casting Couch

ప్రస్తుతం అందరి కళ్ళు త్వరలో మొదలవబోయే బిగ్ బాస్ మూడవ సీజన్ పైన ఉన్న సంగతి తెలిసిందే. మొదటి రెండు సీజన్లు మొదలయ్యాక వివాదాలు సృష్టిస్తే, ఇప్పుడు బిగ్ బాస్ 3 మొదలవకముందే వివాదాలకు తెరతీస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఫిదా సినిమా లో నటించిన గాయత్రీ గుప్త బిగ్ బాస్ 3 నిర్వాహకుల పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇంతకుముందు మీటూ ఉద్యమం జరిగిన సమయంలో కొందరు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని, సినిమాలో ఆఫర్లు ఇస్తామనే నెపంతో పడక సుఖం కోరారని, ఆమె కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బిగ్ బాస్ 3 నిర్వాహకుల నుండి చేదు అనుభవం ఎదురైంది అని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఫిదా సినిమా తో బాగా పాపులరైన గాయత్రీ గుప్త ఈ మధ్యనే ఒక లైవ్ డిబేట్లో శ్వేతా రెడ్డి తో మాట్లాడుతూ బిగ్ బాస్ నిర్వాహకులపై విరుచుకు పడింది. ఆడిషన్స్ కి వెళ్ళిన తనను 100 రోజులపాటు సెక్స్ కి దూరంగా ఉండగలవా అని అడిగారని, వారి దృష్టిలో తాము సెక్స్ టాయ్స్ లాగా కనిపిస్తున్నామా అని ఆమె మండిపడింది.

ఇప్పటికే శ్వేతా రెడ్డి హైదరాబాద్ పోలీస్ బిగ్ బాస్ నిర్వాహకులు పై ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాయదుర్గం పోలీసుల దగ్గర కూడా గాయత్రీ గుప్తా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. చూడబోతే బిగ్ బాస్ వివాదం ముదురుతున్నట్టు తెలుస్తుంది.

Loading...