Thursday, April 25, 2024
- Advertisement -

క్రెడిట్ అంతా కేటీఆర్ కే…..

- Advertisement -

కేటిఆర్ కేటిఆర్ …కేటిఆర్ .ఇపుడు తెలంగాణాలోనే కాదు ఆంధ్రాలోను ఎక్క‌డ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది.ఒక్క‌డే అన్నీ న‌డిపించిన తీరు ఏవిధంగాను కొట్టిపారేయ‌లేం. తెలంగాణ‌కు కేసీఆర్ త‌రువాత ఇత‌డే అనే సంకేతాల‌ను స్ప‌ష్టంగా ఇచ్చేశాడు. క‌వితను ఎక్క‌డా క‌నిపించ‌కుండా చేసి ఫ్యామిళీ పెత్త‌నం అనే మాట‌ను పూర్తిగా తుడిచేశాడు. ఈవిష‌యంలో కేసీఆర్ లెక్క క‌రెక్ట్ గా కుదిరింది. మెట్రో రైల్ మొదటి దశ ప్రారంభం, గ్లోబల్ బిజినెస్ సమిట్.. రెండు మెగా ఈవెంట్స్ లో కేటీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘దిసీజ్ వాట్ కేటీఆర్’ అంటూ సోషల్ మీడియాలో మ‌నోడి పేరు రీసౌండ్ ఆతా. మోడీ దగ్గర, ఇటు ఇవాంకా దగ్గర ఫుల్ మార్కులు వేయించుకున్నాడు. టిఆర్ ఎస్ క్యాడ‌ర్ లో అయితే ఇక మ‌న కేటిఆర్ సారుకు తిరుగులేద‌ని వారంతా ఎగిరిగంతేస్తున్నారు.

మియాపూర్ లో మెట్రో రైల్ ప్రారంభోత్సవం సందర్భంగా రిబ్బన్ కత్తిరించడానికి ముందు.. కత్తెర చేతుల్లో వున్నప్ప‌టికీ.. కేటీఆర్ పక్కన లేడన్న ఒకే ఒక్క కారణంతో మోదీ మొండికేశారు. కేటీఆర్ ని పిలిపించుకుని.. మోడీ రిబ్బన్ కత్తిరించినట్లు టీవీ లైవ్ లో స్పష్టంగా కనిపించింది. HICCలో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఇదే సీనే రిపీటైంది. నలుగురు గొప్ప మహిళా పారిశ్రామికవేత్తలతో కలిసి అత్యంత చాకచక్యంగా ‘ప్యానల్ డిస్కషన్’ నడిపించిన కేటీఆర్ ని ఇవాంకా స్పెషల్ గా అప్రిషియేట్ చేసిందని తెలుస్తుంది.

కేటీఆర్ మాట్లాడిన తీరును చూసిన జ‌నాలు… ఇంగ్లిష్ ఫ్లుయెన్సీ కేటిఆర్ ఇంత భాగా మాట్లాడ‌తాడా అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అప్పోజిష‌న్ లో కూడా కొంద‌రు ఇదే మాట‌లు అన్నారని బ‌య‌ట‌కు వార్త‌లు వ‌స్తున్నాయి.జానారెడ్డి కేటిఆర్ గురించి త‌న స‌హ‌చ‌రుల ద‌గ్గ‌ర చాలా పాజిటివ్ గా మాట్లాడిన‌ట్లు మాట‌లు వ‌స్తున్నాయి.ఏది ఏమైనా కేటిఆర్ క్రెడిట్ మొత్తం కొట్టేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -