Thursday, April 25, 2024
- Advertisement -

కరోనా టైంలో మటన్ తినేవారికి షాక్..!

- Advertisement -

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో కల్తీకి ఎక్కువగా అవకాశం ఉంది. కొందరు మోసగాళ్లు ఈ సమయాన్ని క్యాష్ చేసుకుంటున్నాఉ. వారానికి ఒకసారి తినే మటన్ లోనూ కల్తీ చేస్తూ దారుణ మోసానికి పాల్పడుతున్నారుల్. ఈ కరోనా టైంలో జంతు మాసంలో మోసం చేస్తూ హైదరాబాద్ లో అడ్డంగా దొరికారు. గొర్రె మేక మాంసంలో గొడ్డుమాంసం (బీఫ్)తోపాటు ఇతర జంతువుల మాసం కలిపి విక్రయిస్తున్న దారుణం హైదరాబాద్ లో వెలుగుచూసింది.

షాక్ కలిగించే విషయం ఏంటంటే ఇదో పెద్ద మాఫియా. హైదరాబాద్ అంతా సప్లై చేస్తారట.. వీరిని అధికారులు పట్టుకొని దందా గుట్టురట్టు చేశారు. హైదరబాద్ లోని చాలా ప్రాంతాల్లో మటన్ దుకాణాల్లో తనిఖీలు చేయడంతో గమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో మటన్ లో గొడ్డు మాంసం కలిపి అమ్ముతున్నట్టు తేలింది. వీరంతా మొత్తం హైదరాబాద్ కు సప్లై చేస్తున్నట్టు విచారణలో తెలిసింది. కారణ కారణంగా మటన్ కి గిరాకీ బాగా పెరిగింది. దాంతో కొందరు మోసగాలు ఇలా కల్తీ చేస్తున్నారు.

కరోనా టైంలో పౌష్టికాహారం తింటే మంచిదని సూచిస్తున్న నేపథ్యంతో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. మటన్ రేటు 800-1100 పెరగడంతో ఇలా గోడ్డుమాంసంతో కల్తీ చేస్తున్నారు. మటన్ లో బీఫ్ కలిపి హైదరాబాద్ వ్యాప్తంగా అమ్ముతున్నట్లు తెలియడంతో వినియోగదారులంతా షాక్ అయ్యారు. తాజా తనిఖీల్లో 62 దుఖాణాల్లో 50 దుకాణాలకు లైసెన్స్ లేదు. దీనిపై 3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు అధికారులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -