Saturday, April 20, 2024
- Advertisement -

గోదావరి బోటు ప్రమాదం.. మరో అప్ డేట్

- Advertisement -

గత ఆదివారం గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగింది. ఇప్పటికీ వారం గడుస్తోంది. ఇప్పటికే 37మంది మృతదేహాలు లభ్యంకాగా.. మరో 14 మంది ఆచూకీ దొరకాల్సి ఉంది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 77మంది ఉన్నట్టు అంచనా.. 26మంది సురక్షితంగా బయటపడ్డారు.

అయితే వారం తర్వాత తాజాగా మరో మృతదేహం లభ్యమైంది. సింగనపల్లి వద్ద గాలింపు చర్యలు చేస్తున్న సహాయక సిబ్బందికి మృతదేహం కనిపించింది. దాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో బోల్తా పడింది. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ , నేవి సిబ్బంది గోదావరిలో వెతుకుతున్నారు. బోటును తీయడం కష్టమని తెలిసి వదిలేశారు.

దాదాపు 300 అడుగుల లోతులో ఉన్న పడవ ఏసీ క్యాబన్ లో మరింత మంది ప్రయాణికుల మృతదేహాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అందులోంచే ఒక మృతదేహం కొట్టుకు వచ్చినట్టు కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -