భారత కరోనా యాప్.. మీ దగ్గర్లో కరోనా బాధితుడు ఉంటే వెంటనే చెప్పేస్తోంది..!

6586
government launches official app on corona
government launches official app on corona

దేశంలో అరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 1,964 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. 50 మంది మరణించారు. దాంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అందుకే ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది. దీనిపేరు ‘ఆరోగ్య సేతు’. ఈ యాప్ ను కేవలం 4 రోజుల్లోనే డిజైన్ చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తారు. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే, ఒకవేళ మీకు సమీపంలోకి ఎవరైనా కరోనా బాధితుడు వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. తద్వారా కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ లొకేషన్ ను ఉపయోగించుకోవడం ద్వారా ఈ యాప్ తగిన సమాచారం అందిస్తుంది.

ఈ యాప్ లో యూజర్ డేటా కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే పంచుకుంటారని, థర్డ్ పార్టీతో పంచుకోవడం ఉండదని, అందువల్ల ఇది సురక్షితం అని అధికారవర్గాలంటున్నాయి. ‘ఆరోగ్య సేతు’ యాప్ ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఈ యాప్ లో కరోనా హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్ లపై ఉచితంగా లభించే ఈ ఆరోగ్య సేతు యాప్ 11 భాషల్లో సేవలు అందిస్తుంది.

Loading...