Thursday, April 25, 2024
- Advertisement -

పాస్ పోర్టు రద్దు చేసిన కేంద్రం

- Advertisement -

ప్రముఖ పారిశ్రామిక వేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పాస్ పోర్టును కేంద్రం అధికారికంగా రద్దు చేసింది. దీంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 9,400 కోట్ల రుణ ఎగవేత కేసులో దేశం వదిలిపారిపోయిన మాల్యాను దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

ముంబై ప్రత్యేక న్యాయమూర్తి ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను పరిగణలోకి తీసుకున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్యా పాస్ పోర్టును రద్దు చేసింది. ఇంతకు ముందు మాల్యా పాస్ పోర్టును నెల్లాళ్ల పాటు సస్పెండ్ చేసిన ప్రభుత్వం తాజాగా ఆయన పాస్ పోర్టు రద్దు చేయడంతో మాల్యా భారత్ రాక తప్పేట్టు లేదు.

మాల్యా బ్రిటన్ లో ఉంటున్నట్లు సమాచారం ఉండడంతో ఆయనను అక్కడి నుంచి రప్పించేందుకు న్యాయకోవిదులతో న్యాయశాఖ సంద్రదింపులు జరుపుతోంది. మరోవైపు యుకె ఓటర్ల  జాబితాలో విజయ్ మాల్యా పేరు నమోదై ఉందని ది సండే టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అరవై ఏళ్ల వయసున్న మాల్యా హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని టెవిన్‌గ్రామంలోమూడంతస్తుల భవనంలో ఉంటున్నారని, నార్తో లండన్ నుంచి ఇక్కడకు చేరుకోవాలంటే గంటన్నర ప్రయాణమని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఈ చిరునామాను విజయ్ మాల్యా దృవీకరించడం కొసమెరుపు. భారతదేశంలో తాను ఎలాంటి పన్నుల ఎగవేయలేదని, 1992 నుంచి తాను బ్రిటన్ లోనే ఉంటున్నానని మాల్యా చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -