Saturday, April 20, 2024
- Advertisement -

ప్రభుత్వం ప్రజాసేవకు కట్టుబడి ఉంది..గ‌వ‌ర్న‌ర్‌

- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మూడోరోజు సమావేశాలు ప్రారంభం కాగా గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా ఆయన ప్రసంగం కొనసాగింది.తొలుత కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన గవర్నర్.. సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షించి ప్రజలు విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో హైలెట్స్ ఇవే….

: ఆరోగ్యశ్రీలో ఇప్పుడున్న 1095 వ్యాధులకు అదనంగా మరో 936 వ్యాధులకు చికిత్స
: వెయ్యి రూపాయల కంటే ఎక్కువ వ్యయం అయ్యే వ్యాధులకు ఆరోగ్యశ్రీ
: ప్రభుత్వం సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. నూతన విధానాలు ప్రవేశపెట్టి సుపరిపాలన.
: విభజనచట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి.
: అవినీతి రహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాం.
: పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు.
: ప్రజాధనం వృథా కాకుండా అనేక చర్యలు తీసుకుంటాం.
: ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్‌ టెండరింగ్‌.
: రైతు కోసం రైతు కమిషన్
: ఏపీ విభజన సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా
: ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతాంశాలు
: ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగింపు
: జుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు ప్రయత్నాలు
: గ్రామ సేవలకు రూ. 5వేల వేతనం
: నవరత్నాల పేరుతో సంక్షేమ అజెండా
: దశల వారీ మద్య నిషేధం
: వైఎస్సార్ రైతు భరోసా ద్వారా చేయూత
: వివిధ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు నాలుగేళల్లో ఏడాదికి రూ. 18, 750లు ఆర్ధిక సాయం
: కాపు సంక్షేమం కోసం ఐదేళ్లల్లో రూ. 10 వేల కోట్లు
: ఐదేళ్లల్లో 25 లక్షల గృహాలు
: ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి వైయస్సార్ రైతు భరోసా.. రూ. ఒక్కో రైతుకు రూ.12,500
: పథకాలు అమలులో సంతృప్త మార్గం
: కుల, మత, రాజకీయ సంబంధం లేకుండా అర్హులైన అందరికీ పథకాలు
: ఫిర్యాదు చేసిన 72 గంటల్లో సమస్యల పరిష్కారం, సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -