Saturday, April 20, 2024
- Advertisement -

పాయే… విదేశీ పర్యాటకుల ముందు పరువు పాయే…. ఇదేనా పర్యాటకంలో ఎపిని నం:1 చేయడమంటే?

- Advertisement -

మాటలు కోటలు దాటుతూ ఉంటాయి……. చేతలు మాత్రం కనీసం గడప కూడా దాటవు. పర్యాటక రంగంలో ఎపిని నంబర్ ఒన్ చేస్తానంటాడు. ప్రపంచ పర్యాటకం విషయంలో భారతదేశమే చివరి వరుసల్లో ఉంటుంది. ఇక ఆ భారతదేశంలో ఎపి నంబర్ ఒన్ ఎలా అవుతుంది? ఒకవేళ అయినా ఎన్ని శతాబ్ధాల తర్వాత? ఇప్పటి నుంచీ ఎపి పర్యాటకం విషయంలో అత్యద్భుత అభివృద్ధి కనిపించినా కూడా…….ఆల్రెడీ అభివృద్ధి చెందిన……ఇంకా అత్యద్భుతంగా అభివృద్ధి సాధిస్తున్న దేశాలతో ఒక చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పోటీ పడడం సాధ్యమేనా? కనీస స్థాయి కామన్‌సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సాధ్యమని చెప్పడు. కానీ బాబుగారు మాత్రం ప్రపంచంలోనే ఎపి నంబర్ ఒన్ అంటాడు. ఆయనకదో తుత్తి అని సరిపెట్టుకోవాలేమో మరి. సరే…..ఒకవేళ అంత చిత్తశుద్ధి ఉన్నవాడే అయితే పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో……పర్యాటకులను చూసుకునే విషయంలో ఎంత గొప్పగా ఉండాలి? బాబుగారి గొప్ప అంతా మాటల్లోనే అని మరోసారి నిరూపించిన ….ఎపి పరువు తీసిన సంఘటన ఇదిగో.

అమెరికా, ఐర్లాండ్ దేశాలకు చెందిన ఇరవై మంది స్నేహితులు గుంటూరులో జరుగుతున్న తమ స్నేహితుడి పెళ్ళి చూడడం కోసం వచ్చారు. బాబుగారి కలల రాజ్యం అమరావతిలో ఆ విదేశీ అతిథులకు జరిగిన సన్మానం ఏంటో తెలుసా? ఆ విదేశీ అతిథులను వాళ్ళ స్నేహితుడు గౌరవంగానే చూసుకున్నాడు. కానీ ప్రపంచానికి పాఠాలు చెప్పిన బాబుగారి సమర్థ, అవినీతి రహిత పాలనలోని పోలీసులకు మాత్రం ఎంచక్కా వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ గుంజాలన్న ఐడియా వచ్చింది. ఆ వెంటనే పాస్ పోర్ట్స్ చూపించమని, ఇంకోటని చెప్పి వాళ్ళను భయ భ్రాంతులకు గురిచేసి…… వాళ్ళ దగ్గర డబ్బు గుంజారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలే ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్నాయి. కానీ చంద్రబాబు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఇక పర్యాటక బోటు బోల్తాపడి మనుషులు చనిపోవడం……. ఆ తర్వాత అనుమతిలేని దొంగ బోటులోనే రాష్ట్రపతి భార్యను కూడా ప్రయాణం చేయించడం……. అబ్బో……. బాబుగారి పాలనలో పర్యాటక శాఖ సమర్థత అంతా ఇంతా కాదు. ఇక రీసెంట్‌గా ఆయన బావమరిది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని మరీ ఉత్సవాల గురించి సమీక్ష చేశారు. మొత్తం వెయ్యి కోట్ల స్కాంకి తెరలేపారని ఆ వెంటనే విశ్లేషకులు లెక్కలు తీశారు.

ఒక ప్రత్యేక దేశం కూడా కాని, ఒక అతి పెద్ద దేశంలో చిన్న రాష్ట్రమైన ఎపిని ప్రతి విషయంలోనూ ప్రపంచంలోనే నంబర్ ఒన్ చేస్తా అని బడాయి కబుర్లు చెప్పి అమాయక ప్రజలను ప్రచార డాంభికాలతో నమ్మించడంపై ఉన్న శ్రద్ధ……చేతల్లో కనీసం ఒక్క శాతం చూపించినా మరీ ఇంత ఘోరమైన తప్పులు జరగకుండా ఉంటాయి కదా అని చంద్రబాబుకి సలహా ఇవ్వొచ్చా? అమ్మో…….. ఇంకేమైనా ఉందా…….? తాను ప్రపంచంలోనే నంబర్ ఒన్‌గా చేస్తుంటే అడ్డుకుంటున్నారు అని బాబుతో సహా పచ్చ బ్యాచ్ అంతా విరుచుకుపడిపోరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -