Wednesday, April 24, 2024
- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యేకి షాక్… కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి షాక్ తగిలింది. ఆయనపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదు చేశారు పోలీసులుమాజీ సీఎం చంద్రబాబునాయుడును తలపెట్టిన చలో ఆత్మకూరు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నసంగతి తెలిసిందే.బాబు పిలుప మేరకు టీడీపీ నేతలు అందరూ చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చలో ఆత్మకూరు సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడును పోలీసులు గృహనిర్బంధం చేశారు. కరకట్ట మీద ఉన్న ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. దీన్ని నిరసిస్తూ అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కరకట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులతో అచ్చెన్నాయుడు తీవ్ర వాగ్వాదానికి దిగారు.

బందోబస్తు విధుల నిర్వహణలో భాగంగా అమరావతి కరకట్టపై విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సదారి, కోటయ్య పట్ల అనుచిత ప్రవర్తన, దుర్భాషలాడారంటూ కేసు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30, అమలులో ఉన్నప్పటికీ చట్టం ఉల్లంఘన, విధుల నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకున్నారని పోలీసులు ఫిర్యాదు చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -