Tuesday, April 23, 2024
- Advertisement -

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు బిగ్ సాక్ ..అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చిన జవీఎంసీ

- Advertisement -

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే విజయవాడ కరకట్టమీద ఉన్న అన్ని అక్రమ భవనాలకు నోటీసులు జారీచేశారు. అక్రమంగా ఉన్నా కట్టడాలను కూల్చివేస్తోంది ప్రభుత్వం.

తాజాగా విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని అక్రమంగా నిర్మించారని జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కూల్చివేశారు. విశాఖలోని ద్వారకానగర్ మెయిన్‌రోడ్డులో పీలా గోవింద్ బహుళ అంతస్థుల భవనం నిర్మించుకున్నారు. సరైన అనుమతులు లేని కారణంగా జీవీఎంసీ అధికారులు భవానాన్ని కూల్చేశారు.నిబంధనలు ఉల్లంఘించి మురికి కాలువను ఆక్రమించి దీనిని నిర్మించారని జీవీఎంసీ అధికారులు ఆరోపిస్తున్నారు.

అక్రమ కట్టడంపై అధికారులు ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో రంగంలోకి దిగిన జీవీఎంసీ సిబ్బంది.. అధికారుల సమక్షంలో కూల్చివేత మొదలుపెట్టారు. ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించారు.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై దృష్టిసారించిన సర్కార్.. కూల్చివేత షురూ చేసింది. కృష్ణానది కరకట్టపై ఉన్న ప్రజావేదిక కూల్చివేతతో ఏపీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -