Wednesday, April 24, 2024
- Advertisement -

కెసిఆర్ కి హై కోర్టు ఫోభియా ఏంటి.. ప్రతిసారి..?

- Advertisement -

దేశంలో కరోనా వ్యాప్తి కొద్దీ కొద్దిగా తగ్గుతుందని చెప్పాలి.. గతంలో ఉన్న ఉధృతి అయితే ఇప్పుడు లేదు.. మరణాలు, కేసులు రెండు తక్కువగానే ఉన్నాయి.. అందుకే ప్రజలు కూడా ఈ కరోనా గురించి పెద్దగా ఆలోచించడం లేదు.. మునుపటిలా కరోనా గురించి పట్టించుకోకుండా బయట తమ తమ కార్యకలాపాలు చేసుకుంటున్నారు.. ఇక అందరు సాధారణ జీవితంలోకి వెళ్లిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని వదిలిపెట్టేలా కనిపించింది.. అయితే ఈ విషయాన్నీ తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయినా హై కోర్టు మర్చిపోవట్లేదు..

గతంలో కోర్టు కు తెలంగాణ లో కరోనా పరిస్థితుల పట్ల ఓ నివేదిక ను ప్రభుత్వం అందచేసింది.. అయితే ఈ నివేదిక అవసరమ్యే విషయాలకంటే అనవసర విషయాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చి చెప్పింది. కరోనాపై వాస్తవాలు వెల్లడించేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని.. మరణాలపై తప్పుడు గణాంకాలు ఇస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కరోనా కేసులు తగ్గినా, పెరిగినా.. మరణాలు పదే ఉంటున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల్లోని కరోనా కేసులు, మరణాలతో పోలుస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

అయితే ఈ సారి కూడా హై కోర్టు నుండి ప్రభుత్వానికి మొట్టికాయలే పడ్డాయి.. తాము అడిగిన వివరాలపై నవంబరు 16లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించి.. తదుపరి విచారణ నవంబరు 19కి వాయిదా వేసింది. కరోనా మొదలైనప్పటినుంచి హై కోర్టు ప్రభుత్వానికి భేదాపిప్రాయాలు ఉంటూనే ఉన్నాయి.. వైరస్‌ను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజల్ని గాలికి వదిలేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తూవస్తోంది. హైకోర్టు పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో .. అప్పటి వరకూ కొన్ని చర్యల విషయంలో తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం ..తర్వాత టెస్టులు పెంచడం.. వివారలు అందుబాటులో ఉంచడం వంటి కార్యక్రమాలు చేపట్టింది.

వాతావరణ శాఖ హెచ్చరిక.. నేడు కూడా భారీ వర్షాలు..

హైదరాబాద్ కాదు జలాబాద్.. వందేళ్ళలో ఇది రెండో సారి..?

కరోనా తగ్గిందని లైట్ తీసుకోకండి : మోడీ

యాసంగిలో పంటల సాగు, కొనుగోలు పై కేసీఆర్ సమీక్ష

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -