Saturday, April 20, 2024
- Advertisement -

వాతావరణ శాఖ హెచ్చరిక.. నేడు కూడా భారీ వర్షాలు..

- Advertisement -

గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా ప్రజలు ఈ వర్షాల దాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు ఈ రేంజ్ లో పడుతుండడంతో ఒక్కసారి గా వచ్చిన ఈ ప్రమాదానికి ప్రభుత్వం లు కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి.. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే వర్షాలు భారీ ఎత్తున కురవడంతో రోడ్లపైకి నీరొచ్చే రవాణావ్యవస్థ ను స్థంభించేలా చేస్తుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి.

ఈ వర్షాల ధాటికి వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మృతి చెందగా, నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి.. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.. కాకినాడ, విజయవాడ, రాజమహేంద్రవరం నగరాల్లో లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. దీంతో రాత్రంతా వారు నీటిలోనే గడపాల్సి వచ్చింది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మా ఉధృత రూపం దాల్చడంతో కృష్ణా కరకట్టపై ఉన్న దాదాపు 30 ఇళ్లల్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే అధికారులు నోటీసులు ఇచ్చారు..

వర్షాలతో పాటు ఈదురుగాలుల వల్ల కొబ్బతి ఉద్యాన పంటలు ఎక్కడికక్కడ దెబ్బ తిన్నాయి.. అనేక చోట్ల విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. వందలాది పూరిళ్లు కూలిపోయాయి.. ఉదయం 6.30 – 7.30 గంటల మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్ కాదు జలాబాద్.. వందేళ్ళలో ఇది రెండో సారి..?

కరోనా తగ్గిందని లైట్ తీసుకోకండి : మోడీ

సుప్రీం నిర్ణయం తో రాజకీయ నాయకులలో వణుకు పుడుతుందా..?

తొమ్మిది నెలల్లో మొత్త ఏరిపారేస్తారట.. టెన్షన్ లో రాజకీయ నేతలు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -