Saturday, April 20, 2024
- Advertisement -

కిమ్ అరాచ‌కాల‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పిన మ‌హిళ‌..

- Advertisement -

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ అత్యంత క్రూరుడ‌ని పేరుంది. ఇదంతా బ‌య‌ట‌కి చెప్పుకోవ‌డ‌మే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది. కాని తాజాగా ఉత్త‌ర‌కొరియాలో జ‌రిగే ప్ర‌జ‌లు,మ‌హిళ‌ల‌పై జ‌రిపే అరాచ‌కాల‌ను ప్ర‌త్య‌క్షంగా తాను అనుభ‌వించిన చిత్ర‌హింస‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది ఓ మ‌హిళా.

నియ‌తం దేం ఉత్తరకొరియాలో మహిళలు అనుభవించే నరకాన్ని ఆదేశం నుంచి తప్పించుకున్న మహిళ బాహ్య ప్రపంచం కళ్లకు కట్టింది. హీ యోన్ లిమ్ (26) టీనేజ్ లో ఉండగా కిమ్ సైన్యం ఎత్తుకెళ్లారు. ఆ తరువాత ఆమెను సెక్స్ బానిసగా కిమ్ పరివారం ఇళ్లకు తిప్పారు. కిమ్ పరివారంలోని వారంతా తమను తాము రాజులుగా భావిస్తారని ఆమె తెలిపారు. ఒకరి తరువాత ఒకరి ఇంటికి సెక్స్ బానిసలుగా పంపుతారని అన్నారు. తానే కాదని తనలాంటి చాలా మంది యువతులు వారిళ్లలో సెక్స్ బానిసలుగా మగ్గుతున్నారని ఆమె చెప్పారు.

తామంతా వారి చేతుల్లో నలిగిపోతూ నరకం అనుభవిస్తుంటే వారు ఆనందంతో రెచ్చిపోతారని ఆమె తెలిపారు. కిమ్ పాలనలో ప్రజలంతా బీదలుగా ఉంటారని ఆమె వెల్లడించారు. సెక్స్ బానిసలు నచ్చకపోయినా, ఏదైనా తప్పు చేసినా, గర్భం వచ్చినా వారిని కనిపించకుండా చేస్తారని ఆమె వాపోయారు.

పోర్నోగ్రఫీ చూశారన్న కారణంతో సంగీత బృందంలోని 11 మంది సభ్యులను పొలాల్లోకి ఈడ్చుకొచ్చి ఎయిర్ క్రాఫ్ట్ గన్ లతో తుక్కుతుక్కుగా కాల్చేశారని, అనంతరం వారి శరీరాలను ఆర్మీ యుద్ధ ట్యాంకులతో తొక్కించారని ఆమె చెప్పారు. కిమ్ జాంగ్ ఉన్ కు విశ్వాసంగా లేరని అనిపిస్తే చాలు వారిని వెంటనే ఉరితీస్తారని ఆమె తెలిపారు.

అమె అనుభ‌వించిన న‌ర‌కాన్ని క‌ల్లుకు క‌ట్టిన‌ట్లు తెలిపింది. తాము అతి కష్టం మీద ఉత్తరకొరియా నుంచి చైనాకు అక్కడి నుంచి దక్షిణ కొరియాకు చేరుకున్నామని ఆమె తెలిపారు. సియోల్ లో ప్రస్తుతం ఉంటున్నానని ఆమె వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -