Friday, March 29, 2024
- Advertisement -

స‌మంత‌కు నాగ‌చైత‌న్య బోర్ కొట్టేశాడ‌ట‌..!

- Advertisement -

హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌ని ప్రేమించి మ‌రి పెళ్లి చేసుకుంది హీరోయిన్ స‌మంత‌. పెళ్లికి ముందు వీరిద్ద‌రు క‌లిసి మూడు సినిమాల్లో న‌టించారు. స‌మంత పెళ్లి త‌రువాత సినిమాల్లో న‌టిస్తుంది. దీనికి అక్కినేని అక్కినేని కుటుంబం ఎటువంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. పెళ్లి త‌రువాత స‌మంత న‌టించిన సినిమాలు అన్ని సూప‌ర్ హిట్లే కావ‌డంతో ఆమెకు ఫుల్ డిమాండ్ ఏర్ప‌డింది. కాని నాగ‌చైత‌న్య విష‌యంలో సీన్ పూర్తి రివ‌ర్స్‌గా ఉంది. పెళ్లి త‌రువాత నాగ‌చైతన్య న‌టించిన సినిమాలు అన్ని అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచాయి.

పెళ్లి తరువాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న చిత్రం మ‌జిలి. ఈ సినిమాకు నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌ల అయిన ఈ సినిమా టీజ‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఇక సినిమాను వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో స‌మంత‌, నాగ చైత‌న్య‌లు సినిమా ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో వీరిద్ద‌రు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌మంత త‌న భ‌ర్త గురించి కొన్ని విష‌యాలను అభిమానుల‌తో పంచుకుంది.

ఇటీవ‌లే వీరి మొద‌టి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్నారు. మొద‌టి సంవ‌త్స‌రం ఎలా గ‌డించిద‌ని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు వీరిద్ద‌రు నుంచి వెరైటీ స‌మాధానం వ‌చ్చింది. సమంతా తనపట్ల పొసెసివ్ గా ఉంటుందని కూడా చెప్పాడు. దీనికి సెటైర్‌గా చైతు బోరింగ్ మనిషి అని చెప్పుకొచ్చింది. ఈ మాట‌లు విన్న నెటిజ‌న్లు ఈ క్యూట్ కపుల్ ఇప్పుడిప్పుడే నిజమైన భార్యభర్తలు అవుతున్నార‌ని కామెంట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -